జిల్లాలో పెరగనున్న కోర్టుల సంఖ్య
ATP: ప్రభుత్వం జిల్లాలో కోర్టుల సంఖ్యను పెంచింది. తాజాగా 14 జూనియర్ సివిల్, మూడు సీనియర్ సివిల్ కోర్టులను మంజూరు చేసింది. తాడిపత్రిలో నూతనంగా సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు కానుంది. హిందూపురం, కదిరి, రాయదుర్గం సహా పలు ప్రాంతాల్లో అదనపు కోర్టులు అందుబాటులోకి రానున్నాయి. ఈ నిర్ణయంతో కేసులు త్వరగా పరిష్కారం కానున్నాయి.