VIDEO: 'సరైన పౌష్టికాహారం అందించకపోతే కఠిన చర్యలు'
TPT: వెంకటగిరి జడ్పీ బాలికల పాఠశాలలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనంలో గుడ్ల పంపిణీలో భారీ వ్యత్యాసం గుర్తించి ఏజెన్సీలు, ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు సరైన పౌష్టికాహారం అందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్‌కు నివేదిక ఇచ్చి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.