VIDEO: రాష్ట్రస్థాయి పశు ప్రదర్శన ప్రారంభం
GNTR: ప్రత్తిపాడులో ఎన్టీఆర్ మెమోరియల్ రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి పశు ప్రదర్శన పోటీలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఈ పోటీలను ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో పాల్గొనేందుకు, తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.