పులివెందుల లో ప్రజా దర్బార్ నిర్వహించిన: ఎంపీ అవినాష్

కడప: పులివెందుల పట్టణంలోని బాకరాపురంలో ఉన్న వైసీపీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డికి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.