VIDEO: కొండబిట్రగుంటలో వైభవంగా చక్రస్నానం
NLR: బోగోలు మండలం కొండబిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. ఆలయ పుష్కరిణిలో జరిగిన ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి దంపతులు, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వేదమంత్రాల నడుమ చక్రస్నానం నిర్వహించగా, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.