విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించాలి: జీఎం

BHPL: జిల్లా కేంద్రంలోని సింగరేణి ఉన్నత పాఠశాలను ఏరియా జీఎం రాజేశ్వర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. టాయిలెట్స్ పరిశుభ్రంగా లేకపోవడంతో వాటి నిర్వాహాకులను మందలించి పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు లేకుండా చూడాలన్నారు. విద్యార్థులతో మాట్లాడుతూ.. సమస్యలు ఉంటే తమకు తెలిపాలని, జిల్లాలో ఉత్తమ మార్కులు సాధించాలన్నారు.