'ఘనంగా చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవ వేడుకలు'

ప్రకాశం: జారుగుమల్లి మండలం దవగూడూరు గ్రామంలో బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం 7:00 గంటలకు హోమము, బలిహారణ ఉదయం 9:00 గంటలకు చప్రసేవ, రాత్రి 8:00 గంటలకు గజవాహనసేవ కార్యక్రమాలు జరిగాయి. స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. కాగా ఈ బ్రహ్మోత్సవ వేడుకలు ఈ నెల 24న తారీఖున ముగియనుంది.