'గ్రామీణ అభివృద్ధికి సహకార సంఘాలు బాటలు'

'గ్రామీణ అభివృద్ధికి సహకార సంఘాలు బాటలు'

కృష్ణా: గ్రామీణ అభివృద్ధికి సహకార సంఘాలు బాటలు చేస్తున్నాయని మెరకనపల్లి పీఎసీఎస్ ఛైర్మన్ యర్రంశెట్టి సుబ్బారావు అన్నారు. శుక్రవారం మోపిదేవి మండలం మెరకనపల్లి సహకార సంఘ ఆవరణలో జాతీయ సహకార వారోత్సవాలను ప్రారంభించారు. ఛైర్మన్ సుబ్బారావు సహకార పతాకాన్ని ఆవిష్కరించి, రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ పర్సన్లు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.