విద్యుత్ బిల్లుల బకాయిల వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్

JGL: ఇబ్రహింపట్నం విద్యుత్ శాఖ బకాయిల వసూలు కోసం ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించింది. గోదుర్, తిమ్మపుర్, వేములకుర్తి సహా పలు గ్రామాల్లో బుధవారం నుంచి ఇంటింటి తిరిగి మీటర్లు, బిల్లులు పరిశీలిస్తున్నారు. బకాయిల వసూలుపై ప్రభుత్వం దృష్టి సారించిందని, వినియోగదారులు సహకరించాలని ఏఈ సతీష్ తెలిపారు.