హిల్ట్ పాలసీపై BRS పోరుబాట: దాసోజు
TG: హిల్ట్ పాలసీపై BRS పోరుబాటను కొనసాగిస్తుందని MLA దాసోజు శ్రవణ్ వెల్లడించారు. హిల్ట్ పాలసీ పేరిట కాంగ్రెస్ భారీ స్కాంకు సిద్ధమైందని ఆరోపించారు. పారిశ్రామిక భూములను కాజేసేందుకు, కోట్లు విలువైన భూములను దోచుకునేందుకు సీఎం రేవంత్ ఈ పాలసీని తీసుకువచ్చినట్లు మండిపడ్డారు. గత రెండేళ్లుగా ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కన పెట్టి భూముల చుట్టూ పాలన చేస్తుందని ధ్వజమెత్తారు.