చెరువును తలపిస్తున్న జాతీయ రహదారి

BHPL: కాటారం మండలం మేడిపల్లి టోల్ గేట్ సమీపంలో జాతీయ రహదారి నంబర్-353పై భారీ వర్షపు నీరు చేరడంతో సోమవారం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ మేరకు పంట పొలాల నుంచి వచ్చిన నీటికి టోల్ గేట్ ఇరువైపులా కాలువలు లేకపోవడం వల్ల రహదారిపై నీరు నిలిచిందని స్థానికులు తెలిపారు. కాగా, అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.