కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న వాసుపల్లి
VSP: శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆకాంక్షించారు. గురువారం ఆయన దంపతులతో కలిసి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన, సేవాభావం ఉండాలని సూచించిన ఆయన, అమ్మవారి మహత్యం అనేక జీవితాలకు వెలుగు నింపిందని అన్నారు.