గంజాయి మత్తులో యువకుల హల్‌చల్
NGKL: అచ్చంపేట అంబేద్కర్ కూడలిలో గంజాయి మత్తులో కొందరు యువకులు హల్‌చల్ చేశారు. పట్టణంలోని విద్యానగర్ కాలనీకి చెందిన గోపీకృష్ణపై మధురానగర్ కాలనీకి చెందిన ఉజ్వల్ కారులో వచ్చి ఇనుప రాడ్డుతో దాడికి పాల్పడ్డాడు. గమనించిన వారి స్నేహితుడు అద్వైత్ అడ్డుకొనే ప్రయత్నం చేయడంతో అతనికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటన పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.