సల్వాజుడం పేరుతో కాంగ్రెస్ దారుణాలు చేసింది: షా
కాంగ్రెస్ పార్టీపై కేంద్రమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో విమర్శించారు. సల్వాజుడుం పేరుతో కాంగ్రెస్ అనేక దారుణాలు చేసిందని మండిపడ్డారు. సల్వాజుడుంపై న్యాయమూర్తిగా పని చేసిన సుదర్శన రెడ్డి తీర్పును ఖండిస్తున్నట్లు చెప్పారు. జడ్జిలు తమ వ్యక్తిగత సిద్ధాంతాలను వృత్తిలో జోడించకూడదని హితవు పలికారు. నక్సల్స్ కార్యకలాపాలు అరికట్టేందుకు 2014 కంటే ముందు ఎలాంటి విధానం లేదని తెలిపారు.