దేవరపల్లిలో తాగునీటి సరఫరాకు అంతరాయం

దేవరపల్లిలో తాగునీటి సరఫరాకు అంతరాయం

EG: దేవరపల్లి పంచాయతీ పరిధిలోని యాదవోలు రోడ్డులో ఉన్న పంచాయతీ బోరు మోటారుకు సంబంధించిన విద్యుత్తు వైర్లను గుర్తు తెలియని దుండగులు కత్తిరించారు. దీంతో మోటారు పనిచేయకపోవడంతో మంగళవారం తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని గ్రామ కార్యదర్శి నిట్ట రవి కిషోర్ తెలిపారు. త్వరగా మరమ్మతులు పూర్తి చేసి నీటిని పునరుద్ధరిస్తామని, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.