VIDEO: తప్పిన పెను ప్రమాదం.. నియంత్రణ తప్పి కారు బోల్తా.!
SRPT: కోదాడ పట్టణంలో శనివారం మధ్యాహ్నం ఒక కారు ప్రమాదానికి గురైంది. యూ-టర్న్ తీసుకుంటున్న సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు ఒక్కసారిగా రోడ్డుపై బోల్తా పడింది. కారులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో రోడ్డుపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోగా, పోలీసులు రంగప్రవేశం చేసి వివరాలు సేకరిస్తున్నారు.