శర్వానంద్ ‘బైకర్’ నుంచి మరో సాంగ్ రిలీజ్
శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'బైకర్'. తాజాగా ఈ చిత్రం నుంచి 'జిద్దీ జిద్దీ' లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. కృష్ణకాంత్ రాసిన ఈ పాటను.. స్వీయ సంగీత దర్శకత్వంలో జిబ్రాన్ పాడాడు. మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కథానాయకుడి లక్ష్యాన్ని, పట్టుదలను ప్రతిబింబించేలా ఈ పాటను రూపొందించారు. ఏప్రిల్ 3న ఈ సినిమా విడుదల కానుంది.