బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి: మాజీ ఎమ్మెల్యే
NLG: పెద్దవూర మండలం బట్టుగూడెం, పిన్నవూర గ్రామ పంచాయతీలలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు వెలుగు అనిత అంజయ్య, జిల్లా తిరుపతమ్మ వెంకటయ్యల నామినేషన్ దాఖలు కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్, మాజీ ఎంపీపీ చెన్ను సుందర్ రెడ్డి వారికి మద్దతుగా నామినేషన్‌లో పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు.