పహల్గామ్ దాడిపై ప్రతీకారానికి భారత్ సిద్ధం

పహల్గామ్ దాడిపై ప్రతీకారానికి భారత్ సిద్ధం

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి భారత్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మే 9లోపే సైనిక చర్య ఉండవచ్చని నిపుణులు సైతం అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తమ రష్యా పర్యటనను రద్దు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మే 9న రష్యాలో జరిగే విక్టరీ డే పరేడ్‌కు రక్షణ సహాయ మంత్రి సంజయ్ వెళ్లనున్నారు.