2500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ: నారాయణ
AP: గతంలో వైసీపీ ప్రభుత్వం గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో రాజధాని నిర్మాణం ఆలస్యమైందని మంత్రి నారాయణ ఆరోపించారు. పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. రెండో విడత భూ సమీకరణలో రైతులు ఇచ్చే 7000 పైగా ఎకరాల భూముల్లోని 2500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.