జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం

జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం

నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరంలో అల్పపీడనం ఏర్పడిందని APSDMA వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించినట్లు తెలిపింది. ‘దీని ప్రభావంతో తీరం వెంట 35-55Kmph వేగంతో గాలులు వీస్తాయి. సోమవారం నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు, ప్రకాశం, కడప జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.