‘బీసీల ధర్మపోరాట దీక్ష’
NZB: ఈ నెల 13న రాష్ట్రవ్యాప్తంగా బీసీల ధర్మపోరాట దీక్ష నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని ఓ డిగ్రీ కళాశాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు ‘అష్టాంగ ఆందోళనలు’ కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు.