సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
కృష్ణా: రాష్ట్రంలో పేదల కష్టం తెలిసిన గొప్ప నాయకుడు సీఎం చంద్రబాబు అని, బాధల్లో ఉన్న ప్రజలకు సహాయం అందించడంలో ఆయన ఎప్పుడూ ముందే ఉంటారని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ టీడీపీ కార్యాలయంలో 21 మంది బాధితులకు మంజూరైన రూ.11 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను కూటమి నేతలతో కలిసి సోమవారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు.