మండలంలో రైతులకు యూరియా పంపిణీ
సత్యసాయి: గుడిబండ మండలం కుమ్మరి నాగేపల్లి, చిగుతుర్పి, రైతు సేవా కేంద్రంలో రైతులకు అధికారులు యూరియా పంపిణీ చేశారు. రెండు రైతు సేవా కేంద్రాలకు 280 బస్తాలు స్టాక్ వచ్చినట్లు మండల వ్యవసాయ అధికారి వీర నరేష్ చెప్పారు. ఎరువుల కేంద్రం వద్ద మండల వ్యవసాయాధికారితో పాటు తహసీల్దార్ శ్రీధర్, వీఆర్వో స్వామి దగ్గరుండి యూరియా పంపిణీని పర్యవేక్షించారు.