మళ్లీ పెరుగుతున్న గోదావరి వరద నీటిమట్టం

BDK: భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం గురువారం తెల్లవారుజామున నుంచి క్రమక్రమంగా పెరుగుతుంది. ఉదయం 8 గంటలకు 47.1 అడుగులు వద్దకు చేరింది. మంగళవారం నుంచి బుధవారం రాత్రి వరకు తగ్గిన నీటిమట్టం ఈ రోజు ఉదయం నుంచి మళ్లీ పెరుగుతోంది. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక అమలులో ఉంది. ఉదయం 9 గంటలకు 47.3 అడుగుల వద్దకు చేరింది.