శుభాకాంక్షలు తెలుపుతూనే.. అనంతలోకాలకు

శుభాకాంక్షలు తెలుపుతూనే.. అనంతలోకాలకు

KMM: ఖమ్మం నగరంలో విషాదం చోటుచేసుకుంది. గాంధీచౌక్‌కు చెందిన వ్యాపారి వెంకటరమణ భార్య సుస్మిత(40) గృహప్రవేశ కార్యక్రమానికి వెళ్లారు. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు చెబుతూ ఫోటో దిగుతున్న సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆమె ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.