ధర్మకర్తల మండలికి 98 దరఖాస్తులు

TPT: నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి నియామకానికి 98 మంది దరఖాస్తులు సమర్పించారు. ఆగస్టు 8న దేవదాయ శాఖ అధికారులు నోటిఫికేషన్ జారీ చేయగా 27వ తేదీతో గడువు ముగిసింది. వివిధ మండలాల నుంచి పలువురు నేతలు పోటీలో ఉన్నారు. ఈ సారి మండలి సభ్యుల సంఖ్య 10 నుంచి 13కు పెరిగే అవకాశం ఉందని సమాచారం.