గొల్లపూడి స్కూల్ వద్ద అయ్యప్ప దీక్ష వివాదం

గొల్లపూడి స్కూల్ వద్ద అయ్యప్ప దీక్ష వివాదం

కృష్ణా: గొల్లపూడిలోని GIG ఇంటర్నేషనల్‌ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి అయ్యప్ప దీక్ష తీసుకుని శుక్రవారం పాఠశాలకు వెళ్లాడు. ఈ క్రమంలో యాజమాన్యం ఆ బాలుడిని లోపలికి అనుమతించకుండా ఇంటికి పంపించింది. ఈ సమాచారం అందుకున్నఅయ్యప్ప దీక్షపరులు, ABVP, RSS కార్యకర్తలు పాఠశాల వద్దకు వెళ్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలిసిన పోలీసులు వచ్చి వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.