నందిగామ: గాయత్రీదేవిగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు
కృష్ణ: నందిగామ పట్టణ పరిధిలోని శ్రీపురంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు దసరా నవరాత్రులు రెండవ రోజు గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పంచ ముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్ఠాన దేవత అయిన గాయత్రీదేవిని పూజిస్తే సకల ఉపద్రవాలూ తొలగుతాయనీ, బుద్ధి తేజోవంతం అవుతుందని భక్తుల నమ్మకం.