బిగ్‌బాస్ నుంచి దువ్వాడ మాధురి ఔట్

బిగ్‌బాస్ నుంచి దువ్వాడ మాధురి ఔట్

బిగ్‌బాస్ సీజన్ 9 నుంచి ఈ వారం దువ్వాడ మాధురి ఎలిమినేట్ అయ్యారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టిన మాధురి.. నామినేషన్స్‌లో ఉన్న సంజన, రీతూ చౌదరి, కళ్యాణ్, తనూజ, రాము, డిమోన్ పవన్, గౌరవ్‌ల కంటే ఆడియన్స్ నుంచి అతి తక్కువ ఓట్లు దక్కించుకున్నారు. ఈ విషయాన్ని హోస్ట్ నాగార్జున ప్రకటించారు.