పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

బాపట్ల: ఇంటర్ పరీక్షల ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలోని బాపట్ల జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి పరిశీలించారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ, పర్యవేక్షణ, హాజరైన విద్యార్థులు, గౌర్హజరైన విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట బాపట్ల ఆర్డిఓ గ్లోరియా ఉన్నారు.