నర్సాపూర్ SBI బ్యాంకు ముందు ఆందోళన

మెదక్: నర్సాపూర్ SBI బ్యాంకు ముందు కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఎలక్ట్రోల్ బాండ్ విధానం ద్వారా తీసుకున్న చందాలను కేంద్రం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీం ఆదేశించినా.. BJP ప్రభుత్వం బేఖాతర్ చేస్తుందన్నారు. కార్పొరేట్ రంగాల నుంచి రూ.30 వేల కోట్లు వసూలు చేసిందని ఆరోపించారు. అంతేకాకుండా ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న మోదీని గద్దెదించాలన్నారు.