ఎస్సైపై అత్యాచారం కేసు నమోదు..!

ఎస్సైపై అత్యాచారం కేసు నమోదు..!

WGL: వరంగల్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఎస్సై శ్రీకాంత్‌పై అత్యాచారం కేసు నమోదైంది. కరీంనగర్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఆయన, 2025లో ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన మహిళతో సన్నిహితంగా మారినట్లు సమాచారం. ఆమె ఒంటరిగా ఉంటుందని తెలుసుకుని ఇటీవల వరంగల్‌కు వచ్చి లొకేషన్ ఆధారంగా ఇంటికి వెళ్లి అత్యాచారం చేసినట్లు గురువారం బాధితురాలు ఫిర్యాదు చేసింది.