ధాన్యం కొనడంలేదని రైతుల ఆవేదన
ADB: మార్కెట్లో ప్రభుత్వం సోయాబీన్ పంట కొనడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ గ్రేన్ మార్కెట్లో సోయాబీన్ పంట కొనడంలేదని, దాదాపు రూ.5 లక్షల పెట్టుబడి పెట్టి పండించిన పంటను మాయిశ్చర్ ఉంది అని నిర్వాహకులు తీసుకోవడం లేదని తెలిపారు. ప్రభుత్వం పంట కొనకపోతే పురుగుల మందు తాగి చనిపోవడమే మాకు దిక్కు అని రైతులు వాపోతున్నారు.