BRS పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు
BDK: కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని నాయకులు దుద్దుకూరి సుమంత్ అన్నారు. ఆదివారం జూలూరుపాడు మండలంలో గుండెపుడి గ్రామ పంచాయితీలో BRS పార్టీ నుంచి పలు కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారిని గ్రామ పెద్దలు వెంకటేశ్వరరావు, కృష్ణమూర్తి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు కృష్ణయ్య కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.