VIDEO: కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వినతి

కృష్ణా: భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. ఎమ్మెల్యే రాముకు భవన నిర్మాణ కార్మికులు వినతిపత్రాన్ని శుక్రవారం అందజేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, సంక్షేమ పథకాల అమలు చేసి, గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన 1214 మెమోరాండంను రద్దు చేయాలని కార్మికులు కోరారు.