భారీ వర్షానికి కూలిన ఇల్లు

RR: చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలో పెంటయ్య అనే వ్యక్తి ఇల్లు ఇటీవల కురిసిన భారీ వర్షానికి కూలిపోయింది. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుధవారం ఇల్లు కూలింది. ఇల్లు కూలిపోవడంతో పెంటయ్య కుటుంబం నిరాశ్రయులైంది. ఈ ఘటనపై అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తమకు ఇల్లును కేటాయించాలని బాధితులు కోరుతున్నారు.