కర్నూలు డిగ్రీ కళాశాలలో రేపు జాబ్ మేళా

కర్నూలు: KDC కళాశాలలో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల కరస్పాండెంట్ ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ జాబ్ మేళాలో పరిమల్ ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్, యస్.బి.ఐ కార్డ్స్ లాంటి కంపెనీలు పాల్గొంటాయని, జీతం నెలకు 12 నుండి 20 వేల వరకు ఉంటుందని, ఈ అవకాశాన్ని ఇంటర్, డిగ్రీ, పీజీ చదివిన నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.