సుభాష్ పాలేకర్‌కు YSR మెమోరియల్ అవార్డ్

HYD: హైదరాబాద్‌లోని దస్పల్లాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మెమోరియల్ అవార్డులను ప్రదానం చేశారు. వ్యవసాయ విభాగంలో సుభాష్ పాలేకర్‌కు ఈ అవార్డును ఇచ్చారు. ఈమేరకు ఆయనకు రూ.25 లక్షల చెక్కును కేవీపీ మనవళ్లు అందించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేవీపీ రామచంద్రరావు, మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి పాల్గొన్నారు.