ఓపెన్ జిమ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే
SRD: శారీరక ధారుడ్యం, మానసిక ఉల్లాసం కోసం ఓపెన్ జిమ్‌లు ఎంతగానో ఉపకరిస్తాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానం, కృషి డిఫెన్స్ కాలనీ, సింఫనీ కాలనీలలో 66 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుమార్ ఉన్నారు.