VIDEO: కన్న చెరువుకు బుంగ.. రైతుల ఆందోళన

VIDEO: కన్న చెరువుకు బుంగ.. రైతుల ఆందోళన

WGL: నర్సంపేట మండలం చంద్రపల్లి గ్రామంలోని కన్నె చెరువుకు శుక్రవారం బుంగపడి నీరు వృథాగా పోతోంది. ఆకస్మిక ప్రవాహంతో పంట చేనులు మునిగే పరిస్థితి తలెత్తిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు రక్షణ కట్టలు బలహీనంగా ఉండటంతో రైతులు శ్రమించినా సమస్య కొనసాగుతోంది. ఈ సమస్య పై అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.