సత్తాచాటిన గిద్దలూరు విద్యార్థులు

ప్రకాశం: ఒంగోలులో జరిగిన ఆల్ ఇండియా కరాటే పోటీల్లో గిద్దలూరుకు చెందిన జె. భవ్యంష్ రామ్, వర్షిణీ మెరుగైన ప్రతిభ చూపారు. 9 ఏళ్ల వయసు కేటగిరీలో వర్షిణీ గోల్డ్ మెడల్, 7 ఏళ్ల కేటగిరీలో భవ్యంష్ రామ్ సిల్వర్ మెడల్ సాధించారు. వీరి తండ్రి రామకోటయ్య గిద్దలూరు రూరల్ సీఐగా పనిచేస్తున్నారు.