స్పా సెంటర్లపై దాడులు.. 20 మంది అరెస్ట్
HYD: కేపీహెచ్బీ పీఎస్ పరిధిలో స్పా సెంటర్లపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన రెండు స్పాలపై కేసులు నమోదు చేసి, 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో ఈ దాడులు చేసినట్లు ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.