ఉపాధ్యాయుల క్రికెట్ పోటీలు ప్రారంభం
ELR: నూజివీడు మండలం అన్నవరం గ్రామంలోని క్రికెట్ స్టేడియంలో మండల స్థాయి మెన్ ఉపాధ్యాయుల క్రికెట్ క్రీడాకారుల ఎంపిక పోటీని ఎంఈవో దేవ వరప్రసాద్ మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులను క్రీడాకారులుగా తయారు చేయడమే కాక, తాము కూడా గొప్ప క్రీడాకారులమే అని నిరూపించుకునేందుకు ఉపాధ్యాయులు ముందడుగు వేయడం అభినందనీయమన్నారు.