అక్షర యాన్ బాలిక పురస్కారం అందుకున్న విద్యార్థిని

అక్షర యాన్ బాలిక పురస్కారం అందుకున్న విద్యార్థిని

NZB: 2024-25 సంవత్సరానికి అక్షర యాన్ బాలికా పురస్కారాన్ని ఏర్గట్ల మండలం తడపాకల్ గ్రామానికి చెందిన సౌమ్య అందుకుందని ప్రవీణ్ శర్మ తెలిపారు. సాహిత్యపరంగా సౌమ్య ఇప్పటికే అనేక కవితలు, కథలు రాసి జాతీయస్థాయిలో బహుమతులు అందుకోవడమే కాకుండా 'బంగారు బాల్యం' అనే కవితల పుస్తకాన్ని కూడా ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు. పురస్కారం అందుకున్న సౌమ్యను పలువురు అభినందించారు.