జమ్ములమ్మ పరశురామస్వామి హుండీ లెక్కింపు

జమ్ములమ్మ పరశురామస్వామి హుండీ లెక్కింపు

GDWL: గద్వాల సమీపంలోని జమ్మిచేడు జమ్ములమ్మ, పరశురామ స్వామి ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. దేవాదాయ శాఖ గద్వాల డివిజన్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరి పర్యవేక్షణలో జరిగిన ఈ లెక్కింపులో, గత 30 రోజులకు గాను భక్తులు రూ. 5,71,439 నగదును కానుకలుగా సమర్పించినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈసారి హుండీలో ఎలాంటి బంగారం, వెండి వస్తువులు లభించలేదని పేర్కొన్నారు.