పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు
కృష్ణా: జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ వి. విద్యాసాగార్ నాయుడు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలు చేసి, సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు. విద్యార్థులు ఎటువంటి ఆందోళన లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా భద్రతా చర్యలు తీసుకున్నారు.