బీహార్ ఎమ్మెల్యేల్లో 90% మంది కోటీశ్వరులే

బీహార్ ఎమ్మెల్యేల్లో 90% మంది కోటీశ్వరులే

బీహార్ అసెంబ్లీలో దాదాపు 90 శాతం మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులేనని తేలింది. అంటే, మొత్తం 243 స్థానాలకు గానూ 218 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులేనని తాజాగా వెలువడిన ADR నివేదిక వెల్లడించింది. పార్టీల వారీగా చూస్తే.. జేడీయూలో 85 మందికి 78 మంది(92%), బీజేపీలో 77 మంది, ఆర్జేడీలో 24 మంది, లోక్ జనశక్తి పార్టీలో 16 మంది కోటీశ్వరులు ఉన్నారు.