ఆ పార్టీ అధికారంలోకి వస్తే టెర్రరిస్టులు రాజ్యమేలుతారు

ఆ పార్టీ అధికారంలోకి వస్తే టెర్రరిస్టులు రాజ్యమేలుతారు

NZB: కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే టెర్రరిస్టులు రాజ్యమేలుతారని, కనుక ప్రజల్లో మార్పు రావాలని బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కోరారు. శనివారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీట్ ద ప్రెస్ లో అరవింద్ మాట్లాడుతూ.. దేశ భద్రతపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలని, ఈ విషయమై ప్రజలకు సమాధానం చెప్పిన తర్వాతనే ఓట్లు అడగాలన్నారు.