మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కత్తితో దాడి

NLR: మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని స్నేహితుడిపై ఓ యువకుడు కత్తితో పొడిచిన వైనమిది. నెల్లూరు నిప్పో సెంటర్ సాయిబాబా గుడి వెనక వైపు ఉంటున్న పి. శివాజీ వేదాయపాలేనికి చెందిన రాములు స్నేహితులు. శివాజీ సాయిబాబా గుడి వద్ద ఉండగా రాము వచ్చి మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని అడిగాడు. లేవని చెప్పడంతో కత్తితో పొడిచి పరారయ్యాడు.